మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

by Naveena |
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల రాజు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం 2నిమిషాలు మౌనం పాటించారు. చరిత్రలో స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తి ,నీతి నిజాయితి పరుడు, వివాద రహితుడు అజాతశత్రువు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశ ప్రగతిని గాడిలో పెట్టినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు విశాల భారత దేశానికి ప్రధానిగా చేశారని, ఏ ఒక్కరు కూడా వేలు ఎత్తిచూపని వ్యక్తిత్వం ఆయనదని తెలిపారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా మన్మోహన్ సింగ్ ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి చూపారని అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం పార్టీకే కాకుండా దేశానికి లోటు అని అన్నారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్,అంజిరెడ్డి, అలీబిన్ అబ్దుల్లా,నర్ల రఘు, ఏజాజ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed