గుప్పెడంత మనసు నటి జ్యోతిరాయ్‌కి బిగ్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అశ్లీల ఫొటోలు, వీడియోలు!

by Disha Web Desk 6 |
గుప్పెడంత మనసు నటి జ్యోతిరాయ్‌కి బిగ్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అశ్లీల ఫొటోలు, వీడియోలు!
X

దిశ, సినిమా: బుల్లితెర నటి జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కన్నడ నటి అయిన ఆమె పలు సీరియల్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి మేడమ్‌గా నటించి స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో చీర కట్టు, బొట్టులో సంప్రదాయంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు మోడ్రన్ డ్రెస్‌లు ధరించి హాట్ పిక్స్‌తో నెట్టింట రచ్చ చేస్తుంది.

అయితే ఆమె యంగ్ డైరెక్టర్ సుకు పుర్వాజ్‌ను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇక అప్పటినుంచి జ్యోతిరాయ్ కన్నడలో సీరియల్స్ చేస్తూనే పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల గుప్పెడంత మనసు సీరియల్ క్యారెక్టర్ కూడా ముగియడంతో.. తెలుగు ప్రేక్షకులకు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, జ్యోతిరాయ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ అశ్లీల ఫొటోలు, EDIT BY ABHI అనే అకౌంట్ నుంచి పోస్ట్ అవడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తన యూట్యూబ్ చానెల్‌లో 1000 మంది సబ్‌స్క్రైబర్లు కాగానే అశ్లీల వీడియోలను అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఇందులో తన భర్తతో కలిసి ఓ పార్టీలో రెచ్చిపోయి లిప్‌లాక్ ఇచ్చిన ఫొటో కూడా ఉండటం గమనార్హం. దీంతో ఈ విషయం తెలుసుకున్న కొందరు ఫ్యాన్స్ పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోల్లో, ఫొటోల్లో ఉన్నది జ్యోతిరాయేనా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అవి చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు. అయితే దీనిపై జ్యోతిరాయ్ స్పందించి క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం వెలుగులోకి రాదు.






Next Story