భారీగా రెమ్యునరేషన్ పెంచిన భీమ్లానాయక్ హీరోయిన్!

by Hamsa |
భారీగా రెమ్యునరేషన్ పెంచిన భీమ్లానాయక్ హీరోయిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రాణా ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమాతో హీరోయిన్ సంయుక్త మీనన్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హిట్ మూవీ ‘సార్’తో తనకుంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది.

ఈ క్రమంలో సంయుక్త మీనన్ రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ పెంచేసిందట. ఒక్కో సినిమాకు రూ. కోటి రూపాయల కంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటుందట. అంతేకాకుండా కథ నచ్చితే గ్లామర్ రోల్స్‌లో నటించడానికి కూడా సంయుక్త మీనన్ రెడీగా ఉందట. ప్రస్తుతం ఈ అమ్మడు కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. క్రేజీ ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనీవాస్, సంయుక్తకు కెరీర్ పరంగా హెల్ప్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed