Bhagavanth Kesari OTT : ‘భగవంత్ కేసరి’ ఓటీటీ రిలీజ్ అప్ డేట్

by sudharani |   ( Updated:2023-11-02 12:10:34.0  )
Bhagavanth Kesari OTT : ‘భగవంత్ కేసరి’ ఓటీటీ రిలీజ్ అప్ డేట్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం థియేటర్లలో భారీ కలెక్షన్‌లతో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లకు పైగా రాబట్టింది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావటంతో భారీగా కలిసి వచ్చింది. దీంతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు అందుకుంటున్నాడు.

బాలకృష్ణ యాక్టింగ్, కాజల్ కామెడి, శ్రీలీల ఎమోషనల్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. నవంబర్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍ కాబోతున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుందట. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Advertisement

Next Story