భగవంత్ కేసరి కలెక్షన్లు ఫేక్..! డైరెక్టర్ రియాక్షన్ ఇదే..

by sudharani |   ( Updated:2023-10-30 16:55:41.0  )
భగవంత్ కేసరి కలెక్షన్లు ఫేక్..! డైరెక్టర్ రియాక్షన్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘భగవంత్ కేసరి’. శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ.. అక్టోబర్ 19 న రిలీజై సూపర్ సక్సెస్ అందుకోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. దీంతో ఆ వివరాలను సోషల్ మీడియాలో ఓ రేంజ్ వైరల్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ‘భగవంత్ కేసరి’ భారీ కలెక్షన్లు రాబడుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తొలివారంలోనే ‘భగవంత్ కేసరి’ సినిమా రూ. 112 కోట్లు రాబట్టినట్లు ప్రకటించారు. అయితే వాళ్లు ప్రకటించినది వాస్తవం కాదని.. తొలి వారంలో ఈ మూవీ రూ. 70 నుంచి రూ. 80 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాపై హైప్ తీసుకురావడం కోసమే వాస్తవ నంబర్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వేసి ప్రచారం చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఫేక్ కలెక్షన్స్ అంటూ నెట్టింట వైరల్ అవుతున్న విమర్శలపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ‘మేము ఎలాంటి ఫేక్ కలెక్షన్స్ ప్రకటించలేదు. ‘భగవంత్ కేసరి’ చిత్ర కలెక్షన్స్ గురించి తాము వేస్తున్న నంబర్స్ చాలా జెన్యూన్. అయిన మేము వేస్తున్న కలెక్షన్స్ జెన్యూనో.. కాదో.. అనేది ప్రేక్షకుల రెస్పాన్స్ బట్టే అర్థం చేసుకోవచ్చు’ అంటూ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు డైరెక్టర్. కాగా.. సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న కారణంగా చిత్ర బృందం వైజాగ్, ఏలూరు, విజయవాడ. గుంటూరు ప్రాంతాల్లో సక్సెస్ టూర్ నిర్వహిస్తోంది. మూవీ టీం ప్రస్తుతం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story