రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన బాలయ్య!

by Prasanna |   ( Updated:2023-10-31 07:35:21.0  )
రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన బాలయ్య!
X

దిశ, సినిమా: ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో బాలకృష్ణ.. ఇదే ఊపులో రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడట. ఇటీవల వచ్చిన ‘అఖండ’ కోసం రూ.10 కోట్లు పారితోషికం అందుకున్న ఆయన.. ‘భగవంత్ కేసరి’ కోసం రూ.18 కోట్లు వసూల్ చేశాడట. ఇక రాబోయే సినిమాల కోసం ఏకంగా రూ.28 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంటే దాదాపుగా ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పెంచేశాడట బాలయ్య. ఈ లెక్కన చూస్తే టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా బాలయ్య రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త చర్చనీయాంశమవగా నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Advertisement

Next Story