Bhagwant Kesari : ‘గిప్పడి సంది గేమ్ అలగ్ ఉంటది’.. బాలయ్య ‘NBK108’ సినిమా టైటిల్ రివీల్

by Hamsa |   ( Updated:2023-06-08 05:46:30.0  )
Bhagwant Kesari : ‘గిప్పడి సంది గేమ్ అలగ్ ఉంటది’.. బాలయ్య ‘NBK108’ సినిమా టైటిల్ రివీల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోయిన్ కాజల్, శ్రీ లీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను బాలయ్య బర్త్ డేకు ఒక రోజు ముందే ప్రకటిస్తామని ఇంతకు ముందు మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్

సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా, బాలయ్య ‘NBK 108’ సినిమా టైటిల్‌ను స్వయంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ట్విట్టర్ వేదికగా రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ ‘గిప్పడి సంది ఖేల్ అలగ్’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ కామెంట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

Also Read: ఆదిపురుష్ సినిమాలో బిగ్ మిస్టేక్.. రామాయణం చూశారా అంటూ నెటిజన్స్ ఫైర్..

Advertisement

Next Story