సీక్రెట్‌గా అతడిని పెళ్లి చేసుకున్న బాలయ్య బ్యూటీ.. ఏకంగా నెల తర్వాత ఫొటోలు లీక్

by Hamsa |   ( Updated:2024-03-04 07:11:43.0  )
సీక్రెట్‌గా అతడిని పెళ్లి చేసుకున్న బాలయ్య బ్యూటీ.. ఏకంగా నెల  తర్వాత ఫొటోలు లీక్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నటాషా దోషి బాలకృష్ణ ‘జై సింహా’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కోతల రాయుడు, ఎంత మంచివాడవురా మూవీలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఈ అమ్మడు గత కొద్ది కాలంగా ఓ వ్యాపారవేత్త తో ప్రేమలో ఉంది.

ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి గత ఏడాది తన ప్రియుడు మనన్ షాతో నిర్చితార్థం చేసుకుంది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తూ వచ్చింది. తాజాగా, నటాషా ఏకంగా నెల తర్వాత తన పెళ్ళి ఫొటోలను షేర్ చేసి షాకిచ్చింది. 2024 జనవరి 31న కుటుంబ సభ్యుల సమక్షంలో మనన్ షాను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. దీంతో ఈ విషయం తెలిసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా అంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడానికి ఏమైనా కారణం ఉందా అని చర్చించుకుంటున్నారు. అలాగే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం నటాషా పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More..

‘నీ రాకతో అంతా మారిపోయింది’.. వెడ్డింగ్ డే సందర్భంగా మౌనిక పై మంచు మనోజ్ వైరల్ పోస్ట్..

Advertisement

Next Story