- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలకృష్ణ-చిరు మల్టీస్టారర్! ఊహల్లో తేలిపోతున్న అభిమానులు
దిశ, సినిమా: తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్‌లో సినిమాలు ఆశించకూడదు. అలా మన హీరోల్లో మరో హీరోతో కలిసి నటించాలనే ఉదారత ఉండి వుంటే ఇప్పటికి తెలుగు సినీ పరిశ్రమలో మల్లీస్టారర్ చిత్రాలకు కొదువ ఉండేది కాదు. అయితే మల్టీస్టారర్ సినిమాలు వచ్చినా అవి కొన్ని కాంబినేషన్స్కే పరిమితం అయ్యేవి. మల్టీస్టారర్స్ రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. కథలో ఇద్దరికి సమానమైన ప్రాధాన్యత.. ఇద్దరికి హీరోయిన్స్.. ఇక తెరవెనుక ఉండే రీజన్స్ అనేకం. అయితే కొన్ని కాంబినేషన్స్ల్లో అస్సలు మనం మల్టీస్టారర్స్ సినిమాలు ఊహించలేం.
అలాంటి కలయికే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. ఇటీవల జరిగిన నందమూరి బాలకృష్ణ యాభై సంవత్సరాల వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. బాలకృష్ణతో కలిసి ఓ సినిమాలో నటించాలనుందని అన్నారు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ ''నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలని ఒక కోరిక' అన్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనే చర్చలు ఆల్రెడీ సినీ పరిశ్రమలో మొదలయ్యాయి.
చిరంజీవి,బాలకృష్ణ కలయికలో సినిమా రావాలంటే ముందుగా అందుకు తగ్గ కథ దొరకాలి.. దొరికినా అందులో రెండు పాత్రల ప్రాధాన్యత సమానంగా ఉండాలి. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా అభిమానుల సంగతి తెలిసిందే. అయితే ఏది ఏమైనా ఇప్పటికైనా ఇద్దరు హీరోల మదిలో ఇలాంటి ఆలోచన ఉంటే రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో నైనా ఇది కార్యరూపం దాల్చడానికి ప్రయత్నించవచ్చు. ఇందుకు సరిపోయే కథతో దర్శకుడు ముందుకు వస్తే.. ఈ కాంబినేషన్‌కు అంకుర్పారణ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ విషయం తెలిసిన ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. అంతేకాకుండా వీరిద్దరి కాంబోలో మూవీ వస్తే ఎలాంటి స్టోరీ రావాలో ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతున్నారు.