- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మా ఊరి బలగంతో.. బలగం మూవీ

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం గ్రామాలలో బలగం మూవీ సందడి నెలకొంది. ఎక్కడ చూసినా పల్లెలు బలంగం మూవీతో దర్శనమిస్తున్నాయి. బంధాల విలువలను తెలియబరుస్తూ, అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన బలగం మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పల్లెల్లో రక్త సంబంధాలను గుర్తు చేస్తూ, మానవ విలువలు మరచి, స్వార్థాలతో, ద్వేశాలతో చిన్న చిన్న గొడవలకు దూరం అవుతున్న బంధాలకు కనువిప్పు కలిగించే ఈ చిత్రాన్ని, గ్రామ ప్రజలందరూ ఒక్కటై వీక్షిస్తున్నారు.
తాజాగా, కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, గంగారం గ్రామంలో సర్పంచ్, యువత ప్రోత్సాహంతో గ్రామంలో విలువలు మరిచి దూరం అవుతున్న కుటుంబాలను ఒకటి చేసే ఆలోచనతో గ్రామ పంచాయితీ వద్ద బలగం మూవీని ప్రదర్శిస్తున్నారు. దీంతో పల్లె ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బలగం మూవీ చూడటానికి అందరూ సిద్ధమయ్యారు.
Also Read..
చరణ్‌తో పెళ్లి జరిగిన కొత్తలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా: ఉపాసన