బాత్‌రూమ్‌లో కూర్చొని బోరున ఏడ్చేసిన బలగం బ్యూటీ.. ఏం జరిగిందంటే..

by Javid Pasha |   ( Updated:2024-05-31 06:33:21.0  )
బాత్‌రూమ్‌లో కూర్చొని బోరున ఏడ్చేసిన బలగం బ్యూటీ.. ఏం జరిగిందంటే..
X

దిశ, సినిమా : ఒక్కసారి సినీ ఫీల్డులోకి అడుగు పెట్టాక అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. ప్రేక్షకుల ఆసక్తి, అభిరుచులను బట్టి, తమ నటన, అభినయం ప్రదర్శించినవారే ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు. లేకపోతే అంది వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోవచ్చు. అందుకే హీరో, హీరోయిన్లు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతుంటారు.

టాలెంట్ ఉన్నప్పటికీ గ్లామర్ ఫీల్డులో ఎప్పుడూ పరిస్థితి ఒకేలా ఉంటుందని చెప్పలేం. కొన్నిసార్లు వరుస ఆఫర్లు తలుపు తడితే.. మరికొన్ని సార్లు అస్సలు అవకాశాలే లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితిని ఎంతోమంది ఫేమస్ హీరోయిన్లు కూడా ఎదుర్కొన్నారు. ప్రస్తుతం బలగం బ్యూటీ కావ్యా కళ్యాణ్ రామ్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోందట.

స్నేహమంటే ఇదేరా సినిమాతో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన కావ్యా కళ్యాణ్ రామ్, ఆ తర్వాత గంగోత్రి, బాలు, ఠాగూర్ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో కూడా నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కొంతకాలం మూవీస్‌కి గ్యాప్ ఇచ్చిన కావ్య గత సంవత్సరం వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించడంతో కావ్యకు వరుస ఆఫర్లు తలుపు తడతాయని అందరూ ఊహించారు. ఆమె కూడా ఇదే ఫిక్స్ అయింది. కానీ అనుకున్నంత మేర అవాకాశాలు రాకపోవడంతో డైలామాలో పడిందట.

చివరికి ఆఫర్లకోసం గ్లామర్ డోస్ పెంచి, సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం స్టార్ట్ చేసింది కావ్యా కళ్యాణ్ రామ్. ఈ మధ్య తరచూ హాట్ ఫొటో షూట్లను అభిమానులతో పంచుకుంటోంది. అయినా మూవీ అవకాశాలు రాకపోవడంతో డిస్సప్పాయింట్ అవుతోందట. రీసెంట్‌గా ఇదే విషయమై ఎమోషనల్ అయిన కావ్య బాత్ రూమ్‌లో కూర్చొని బోరున ఏడ్చేసిందట. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుండగా.. ‘శ్రీలీలకే అవకాశాల్లేక పిల్లలతో ఆడుకుంటోంది. నువ్వెందుకు బాధపడటం.. టైమ్ వచ్చేదాకా వెయిట్ చేయి’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed