పెళ్లికి సిద్ధమైన మరో స్టార్ జోడీ.. ఆ లగ్జరీ బంగ్లాలోనే

by Hamsa |   ( Updated:2022-09-06 09:52:35.0  )
పెళ్లికి సిద్ధమైన మరో స్టార్ జోడీ.. ఆ లగ్జరీ బంగ్లాలోనే
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్ అతియా శెట్టి ఇండియన్ క్రికెటర్‌ కేఎల్ రాహుల్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఇటీవల ఇరు కుంటుంబాలను ఒప్పించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ఈ శుభకార్యానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్. అంతేకాదు అతియా తండ్రి సునీల్ శెట్టి ఓ లగ్జరీ బంగ్లాలో గ్రాండ్‌గా ఈ వెడ్డింగ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం.

ఇక రాహుల్ కూడా ఓ వెడ్డింగ్‌ ప్లానర్‌‌ను కలిసి పెళ్లికి కావాల్సిన నిర్వహణ ఏర్పాట్లపై చర్చించాడని, రెండు కుంటుంబాల్లో పెళ్లి సందడి మొదలైనట్లు సన్నిహితవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్న న్యూస్‌పై ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Also Read : కాస్త ఇంగితజ్ఞానంతో మాట్లాడండి: నెటిజన్లపై బుమ్రా భార్య ఫైర్

Also Read : కొత్త ఫామ్‌హౌస్‌లోకి విరుష్క జంట.. ఎన్ని కోట్లో తెలుసా?

Advertisement

Next Story