Nukaraju Asiya: నూకరాజు- ఆసియా లవర్స్ కాదా.. అన్నా చెల్లెల్లా? షాక్ లో ఫ్యాన్స్

by Prasanna |   ( Updated:2024-08-15 15:44:53.0  )
Nukaraju Asiya: నూకరాజు- ఆసియా లవర్స్ కాదా.. అన్నా చెల్లెల్లా? షాక్ లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా : బుల్లితెర కమెడియన్ నూకరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ షో ద్వారా మన తెలుగు ఆడియెన్స్ ను పరిచయమయ్యాడు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో అందర్ని కడుపుబ్బా నవ్విస్తూ తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యాడు.

జబర్దస్త్ షోలో లేడీ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆసియా మనందరికీ తెలిసిందే. ఈ అమ్మాయితో నూకరాజు మొదటి నుంచి చనువుగా ఉండేవాడు అది కాస్తా స్నేహంగా మారి ప్రేమ వరకు వెళ్ళింది. అయితే, ఆ మధ్య వీరిద్దరికి గొడవలు జరిగి బ్రేకప్ కూడా కూడా అయ్యిదంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. కట్ చేస్తే ప్రస్తుతం నూకరాజు, ఆసియా ప్రైవేట్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు. మొన్న వచ్చిన నా గుండె గోదారి లవ్ ఫెయిల్యూర్ పాట లక్షల వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈ పాటతో వీరిద్దరూ లవర్స్ అని కన్ఫర్మ్ అయింది. కానీ, ఎవరు ఊహించని విధంగా ఆసియాతో ఉరితాడు ఉయ్యాలయ్యిందా నా చెల్లమ్మ అంటూ చెల్లి పాత్రలో ఆసియా నటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ సాంగ్ ఒక వైపు పాపులర్ అవుతూనే ఉంది మరో వైపు అదే మీరు లవర్స్ కాదా.. అన్నా చెల్లెల్లా అంటూ ప్రేక్షకులు, ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీటి పైన నూకరాజు కానీ ఆసియా కానీ ఇంత వరకు స్పందించలేదు. ఇద్దరిలో ఎవరు ఒకరు రెస్పాండ్ అయితే తప్ప అసలు నిజం ఏంటన్నది తెలియదు. మరి, దీనిలో ఎంత వరకు నిజమున్నదో తెలియాలంటే వేచి చూడాలి.

Advertisement

Next Story