హీరోయిన్ ఆశా శైనీకి ప్రియుడి లైంగిక వేధింపులు.. ప్రైవేట్‌పార్ట్స్‌పై బాదుతూ..

by sudharani |   ( Updated:2023-01-31 12:54:55.0  )
హీరోయిన్ ఆశా శైనీకి ప్రియుడి లైంగిక వేధింపులు.. ప్రైవేట్‌పార్ట్స్‌పై బాదుతూ..
X

దిశ, సినిమా : టాలీవుడ్‌కు లక్స్‌ పాపగా పాపులారిటీ పొందిన హీరోయిన్ ఆశా శైనీ తనను నిర్మాత గౌరంగ్ దోషి గృహ హింస, లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలిపింది. 20ఏళ్ల వయసులో కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలో అబ్యూజివ్ రిలేషన్ షిప్‌తో డౌన్ ఫాల్ ఎదుర్కొన్నట్లు ఇన్‌స్టా వేదికగా చెప్పుకొచ్చింది. ఫేస్, ప్రైవేట్ పార్ట్స్‌పై దారుణంగా కొట్టేవాడని, ఇందుకు సంబందించిన ఇమేజెస్ షేర్ చేసింది.

తన వర్క్ నుంచి దూరంగా ఉండమని తన ఫోన్ లాక్కున్నాడని, 14 నెలలుగా ఎవరితో కాంటాక్ట్‌లో లేకుండా ఇంట్లోనే బంధించాడని తెలిపింది. మొత్తానికి అతని నుంచి తప్పించుకుని ప్రస్తుతం అమ్మానాన్నతో హ్యాపీగా ఉంటున్నానని తెలిపింది. కాబట్టి మ్యాజిక్ ఆఫ్ లైఫ్ గురించి నమ్మకాన్ని కోల్పోకుండా జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని, యూనివర్స్ కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుందని చెప్పింది ఆశా శైనీ.

Advertisement

Next Story