నువ్వేమైనా పెద్ద పొలిటిషియన్‌వా.. బొంగేం కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు.. శ్యామలపై డైరెక్టర్ ఘాటు వ్యాఖ్యలు

by Kavitha |
నువ్వేమైనా పెద్ద పొలిటిషియన్‌వా.. బొంగేం కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు.. శ్యామలపై డైరెక్టర్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున యాంకర్ శ్యామల పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వంగా గీతకు మద్దతుగా క్యాంపైన్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పవన్ కళ్యాణ్‌ని కూటమి నేత చంద్రబాబుని ఉద్దేశిస్తూ తోడేలు, గుంట నక్క అంటూ ఓ కథ చెప్పి తీవ్ర విమర్శలు గుప్పించింది. దీంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు.

ఇదిలా ఉండగా తాజా ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ తరుపున ప్రచారం చేసిన వారిని టీడీపీ క్యాడర్ టార్గెట్ చేస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై శ్యామల చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు దర్శకుడు గీతాకృష్ణ. అందులో భాగంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై శ్యామల చెప్పిన కథ గురించి నాకు తెలిసింది. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత అసలు శ్యామల ఎక్కడ.. ఇప్పుడు చెప్పమను జగన్ కి కథలు. ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు శ్యామలకు డబ్బులో లేదంటే మరేదో స్వలాభం కోసం ప్రచారం చేసి ఉంటుంది. వంగా గీత పిఠాపురంలో ఓడిపోతుందని నేను ఎప్పుడో చెప్పాను. శ్యామల ఎవరో కూడా జనానికి తెలియదు అంటూ ఫైర్ అయ్యారు.

అదే ఇప్పుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు వెళితే మొఖాన ఉమ్మేస్తారు. జగనన్న అంటూ భజన చేసింది. ఇప్పుడు జగన్ కే అడ్రస్ లేదు. రాజకీయాల గురించి ఆమెకు ఏం తెలుసు. మొగుడిపై ఏవో కేసులు ఉన్నాయని ప్రచారానికి వెళ్ళుంటుంది. ఇక ఆమెకు అవకాశాలు కూడా రావు. కాళ్ళపై పడాల్సిందే లేదంటే కష్టం. నువ్వేమైనా పెద్ద పొలిటిషియన్ వా, హీరోయిన్ వా .. ఏ బొంగు కాదు .. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అంటూ శ్యామల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story