వారికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అనుపమ.. అలా రాసినందుకు థాంక్స్ అంటూ..

by Jakkula Samataha |
వారికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అనుపమ.. అలా రాసినందుకు థాంక్స్ అంటూ..
X

దిశ, సినిమా : కర్లీ హెయిర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ టాలీవుడ్‌లో నటిగా మంచి పేరు సంపాదించుకుంది.

ఇక ఎప్పుడు కూల్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఓ వెబ్ సైట్ పై విరుచుకపడింది. కీర్తీ సురేష్, అనుపమ హీరోయిన్లుగా, జయం రవి హీరోగా తెరకెక్కిన మూవీ సైరన్. అయితే ఈ మూవీలో అనుపమ పాత్ర కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉండడమే కాకుండా, ఆమెకు డైలాగ్స్ కూడా ఉండవు, అంటూ ఓ వెబ్ సైట్ రాసుకొచ్చింది. దీంతో ఇది చూసిన అనుపమ వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది. తాను ఈ ఘటనపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. మాటలు రాని పాత్రకి డైలాగ్స్ లేవు అని రాసిన మిమ్ముల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఘాటుగా మెసేజ్ చేసింది. దీంతో ఆ వెబ్ సైట్ యాజమాన్యం స్పందించి, మార్చుతాం మేడం చూసుకోలేదు అంటూ రిప్లై ఇచ్చారు. కాగా, దీనికి సంబంధించిన స్రీన్ షాట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇక తెలుగులో అనుపమ, సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్‌లో టిల్లు స్క్వేర్ త్వరలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా అనుపమా రొమాంటిక్‌గా, తన అందాలను ఆరబోస్తూ సరికొత్తగా కనిపించింది. ఇక త్వరలో ఈ మూవీ విడుదల కానున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story