తెలుగులో రీ రిలీజ్‌‌కు రెడీ అయిన ‘రఘువరన్ B.Tech’

by samatah |   ( Updated:2023-08-09 06:38:10.0  )
తెలుగులో రీ రిలీజ్‌‌కు రెడీ అయిన ‘రఘువరన్ B.Tech’
X

దిశ, సినిమా: గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా స్టార్ట్ అయిన రీ రిలీజ్ ట్రెండ్ ఏడాది పూర్తి చేసుకుంది. ‘పోకిరి’ నుంచి మొదలు టాలీవుడ్ స్టార్ హీరోల హిట్ చిత్రాలను ఒక్కొక్కటిగా రీ రిలీజ్ అవుతూ వచ్చాయి. అయితే తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా రీసెంట్‌గా తమిళ క్లాసిక్ చిత్రం ‘సూర్య S/o కృష్ణన్’ కూడా తెలుగులో రీ రిలీజై మంచి వసూళ్లు రాబట్టింది. కాగా తాజాగా మరో తమిళ హిట్ మూవీ కూడా విడుదలకాబోతుంది. ధనుష్ నటించిన ‘రఘువరన్ B.Tech’ చిత్రం రీ రిలీజ్ కానుంది. ఇప్పటికి కూడా ఈ మూవీ టీవీలో వస్తే వదలకుండా చూస్తారు జనాలు. కాగా అభిమానుల కోసం ఈ సినిమాను ఈ ఆగస్టు 18న తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు.

Read More: Salaar : విడుదలకు ముందే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘సలార్’!

Advertisement

Next Story