పెళ్లికి గిఫ్ట్ గా ఆ స్టార్ హీరోలకు ఖరీదైన వాచ్ లు ఇచ్చిన అనంత్ అంబానీ.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

by Prasanna |   ( Updated:2024-07-14 05:20:26.0  )
పెళ్లికి  గిఫ్ట్ గా ఆ స్టార్ హీరోలకు ఖరీదైన వాచ్ లు ఇచ్చిన అనంత్ అంబానీ.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
X

దిశ, సినిమా: రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహ వేడుక ఘనంగా జరిగింది. జూలై 12న అనంత్ తన స్నేహితురాలు అయినా రాధికను పెళ్లాడాడు. వీరి వివాహానికి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ తారలు హాజరయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినీ తారలతో పాటు క్రికెట్ స్టార్స్ కూడా అటెండ్ అయ్యారు.

ఈ పెళ్లికి ఐదు వేల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ తారలకు అనంత్ అంబానీ కాస్ట్ లి వాచ్ లను బహుమతిగా ఇచ్చాడు. షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ తో అనంత్ అంబానీకి మంచి స్నేహం ఉంది. అనంత్ అంబానీ వీరికి పెళ్లి సందర్భంగా ఖరీదైన వాచ్ లను బహుమతిగా ఇచ్చాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.’అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్’ అనే కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర రూ.2 కోట్లకి పైగా ఉంటుంది. కొందరు వామ్మో ఇంత డబ్బు పెట్టి గిఫ్ట్ లుగా ఇచ్చారా అని అంటుండగా.. ఇంకొందరు వారికేమైనా డబ్బు తక్కువగా ఉందా ఆ కోట్లు పెట్టి చిన్న పిల్లలను చదివించాల్సింది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed