సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అల్లు అర్హ డ్యాన్స్ వీడియో.. తలపై ప్లేట్‌తో ఇరగదీసిందిగా!

by Jakkula Samataha |   ( Updated:2024-03-02 15:35:44.0  )
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అల్లు అర్హ డ్యాన్స్ వీడియో.. తలపై ప్లేట్‌తో ఇరగదీసిందిగా!
X

దిశ, ఫీచర్స్ : అల్లు అర్జున్ గారాల పట్టీ అల్లు అర్హ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్యూట్ క్యూట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక అల్లు అర్హకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. అయితే తాజాగా అల్లు అర్హ యానిమల్ మూవీలోని జమల్ కుదు అనే పాటకు వెరైటీ స్టెప్స్ వేసి అందరినీ ఆకట్టుకుంది.

మూవీలో తలపై గ్లాస్ పెట్టుకుని బాబీ డియోల్ డ్యాన్స్ చేస్తే, ఈ స్టార్ కిడ్ మాత్రం తలపై ప్లేట్ పెట్టుకొని, స్టెప్స్ వేసింది. బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌లో తలపై ప్లేట్ పెట్టుకొని, డ్యాన్స్ చేస్తూ, అందరితో ప్రశంసలు పొందుతుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది తెగ వైరల్ అవుతోంది. బన్నీ కూతురంటే ఆ మాత్రం ఉండాలి. అల్లు అర్హ నువ్వు సూపర్ అంటూ..తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story