ALLU SNEHA REDDY: జిమ్‌లో అలాంటి పనులు చేస్తున్న అల్లు అర్జున్ భార్య.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

by Kavitha |
ALLU SNEHA REDDY: జిమ్‌లో అలాంటి పనులు చేస్తున్న అల్లు అర్జున్ భార్య.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, సినిమా: స్టార్ కపూల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు స్నేహ రెడ్డిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి 2011లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి అయాన్, అర్హ అనే పాప, బాబు కూడా జన్మించారు. ఇక అప్పటి నుంచి వీరు అన్యోన్యంగా ఉంటూ మంచి లైఫ‌్‌ను లీడ్ చేస్తున్నారు. అయితే స్నేహ రెడ్డి సినిమాల్లో తన భర్త బిజీగా ఉంటున్నప్పటికీ తను మాత్రం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. కళాశాలతో పాటు ఇతర వ్యాపారాలను కూడా నిర్వహిస్తోంది. ఏ కార్యక్రమానికి వెళ్లాలన్నా అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, కొడుకు, కూతుర్ని తీసుకుని కుటుంబ సమేతంగా హాజరవుతుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలను స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలాగే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా తన అందంతో స్నేహ రెడ్డి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు స్నేహ రెడ్డి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్.. నువ్వు సూపర్ వదిన.. అన్నయ్యతో కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది అని, ఇద్దరు పిల్లల తల్లివి అయినా జిమ్‌లో బాగా కష్టపడుతున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఫిట్ ఉండడానికి ఎంతో శ్రద్ధ చూపిస్తున్నావు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానులతో గొడవ జరగడంతో నిర్మాతలు డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు.

( video link credits to Telugu FilmNagar X account )

Advertisement

Next Story

Most Viewed