- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పొలిటికల్ ఎంట్రీపై అల్లు అర్జున్ సంచలన ప్రకటన.. ఎన్నికల వేళ మనసులో మాట బయటపెట్టిన స్టైలిష్ స్టార్..!
దిశ, వెబ్‌డెస్క్: నాలుగో విడత లోక్ సభ ఎన్నికల వేళ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. తనకు అధికారికంగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, తనకు పాలిటిక్స్‌లోకి వచ్చే ఆలోచన లేదని రాజకీయ అరంగ్రేటంపై స్టైలిష్ స్టార్ కుండబద్దలు కొట్టారు. కాగా, సోమవారం అల్లు అర్జున్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు సతీమణి స్నేహారెడ్డితో కలిసి వెళ్లి ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం స్టైలిష్ స్టార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ఇవ్వడంపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో తనకు సన్నిహితులైన వారికి మద్దతు మాత్రమే ఇస్తానని తెలిపారు.
ఇందులో భాగంగానే వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ ఇచ్చానని క్లారిటీ ఇచ్చారు. గత ఎన్నికల సందర్భంగా శిల్పా రవిని కలవడం కుదరలేదని.. అందుకే ఈ సారి ఇంటికి వెళ్లి కలిశానని నంద్యాల టూర్‌పై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్, బన్నీవాసు, తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిలకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఇక, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక, నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ మొదలైంది. ఈ క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు.