బన్నీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. అదిరిపోయిన న్యూ లుక్..!

by Javid Pasha |   ( Updated:2023-03-30 12:32:18.0  )
బన్నీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. అదిరిపోయిన న్యూ లుక్..!
X

దిశ, వెబ్ డెస్క్: ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ‘పుష్ప 2’ షూటింగ్ తో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ మధ్య మీడియాలో కనబడటం లేదు. కాగా బన్నీ ఫ్యాన్స్ కు ఓ అదిరిపోయే న్యూస్. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ మీడియా కంటికి చిక్కారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమైన బన్నీ.. తన న్యూ లుక్ తో అదరగొట్టారు. వైట్ జీన్స్, బ్లాక్ టీషర్ట్ లో కనిపించి పండగ పూట ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు.


షూటింగ్ నిమిత్తం బన్నీ ఫారిన్ వెళ్తున్నట్లు సమాచారం. ఇక కొంత కాలంగా అల్లు అర్జున్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు కూడా బన్నీ హాజరుకాలేదు. అయితే షూటింగ్ నిమిత్తం అల్లు అర్జున్ ఫారిన్ లో ఉండటం వల్ల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు రాలేదని బన్నీ కుటుంబ సభ్యులు చెప్పారు.

ఇవి కూడా చదవండి: సరిగ్గా ఇదేరోజు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామ్ చరణ్

Advertisement

Next Story