మహేష్ బాబుకు రావాల్సిన నేషనల్ అవార్డ్ అల్లు అర్జున్ కొట్టేశాడు

by Nagaya |   ( Updated:2023-08-26 12:30:52.0  )
మహేష్ బాబుకు రావాల్సిన నేషనల్ అవార్డ్ అల్లు అర్జున్ కొట్టేశాడు
X

దిశ, సినిమా: తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. బన్నీ ఇన్నాళ్ల కష్టానికి ఫలితం దక్కిందని సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. అయితే నిజానికి ఈ అవార్డు మహేష్ బాబుకు రావాల్సిందనే ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అవును.. మీరు విన్నది నిజమే. వాస్తవానికి సుకుమార్ మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని పుష్ప 1, పుష్ప 2 కథలను సిద్ధం చేశాడు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించుకున్నాడు సూపర్ స్టార్. ఒకవేళ ఈ సినిమాలో మహేష్ నటించి ఉంటే కనుక పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడంతోపాటు అల్లు అర్జున్‌కు బదులు ఆయనకే ఈ అవార్డు కూడా వచ్చేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story