- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రాండ్ కనిపించేలా కారు టైర్లు డిజైన్ చేయించుకున్న అల్లు అర్జున్.. ఫొటోస్ వైరల్
దిశ, సినిమా: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఈ క్రేజీ హీరో క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా ఈ హీరో షూటింగ్ సమయంలో గాయపడినట్లు వార్తలొచ్చాయి. చిన్నగాయం కాబట్టి డాక్టర్‌ను సంప్రదించడంతో వన్ వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారట.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు అక్కడకి వచ్చిన ఫ్యాన్స్.. బన్నీ కారు టైర్స్‌ను గమనించారు. అల్లు అర్జున్ ధరించే డ్రెస్సులు నుంచి హెయిర్ స్టైల్ వరకు యూజ్ చేసే వస్తువులు చలా స్టైలిష్‌గా ఉంటాయి. ఇలాగే తన కారు ‘AA’ అని లోగో వచ్చేలా దగ్గరుండి మరీ డిజైన్ చేయించుకున్నాడు. బన్నీ ఫ్యాన్స్ ఆ కారును ఫొటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సినిమాలు, బిజినెస్‌లకు ఈ సంతకమే.. లోగో మార్క్ అయిన విషయం తెలిసిందే.
ఇక పుష్ప 2 చిత్ర షూటింగ్ విషయానికి వస్తే.. చాలా రోజుల నుంచి ఈ సినిమాలో పోశమ్మ జాతర సీన్ షూట్ జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. జాతర బ్యాక్‌డ్రాప్ తో ఒక పాట, ఫైట్ సీక్వెన్స్ ఉండనుందట. ఇదే ఈ చిత్రంలో హైలైట్ కానుందని సమాచారం. నెలలు గడుస్తున్నా ఇంకా అదే షూట్ చేస్తుండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మరికొంతమంది జనాలు దీనిపై పలు మీమ్స్ క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక పుష్ఫ.. 2 భాగాలు కాదు మూడో పార్ట్ కూడా వస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
#Pushpa2TheRule Song Shoot at RFC Hyderabad#AlluArjun #PushpaTheRule pic.twitter.com/E8PbVUCqEr
— 𝗔𝗔 𝐋𝐢𝐧𝐠𝐚𝐬𝐰𝐚𝐦𝐲 𝕏 🐉 (@lingaswamyaa) February 2, 2024
Inka Jathara Scene making ye na
— Race Gurram 🐎 (@racexgurram) February 9, 2024
Jathara Rathnalu @alluarjun @aryasukku @ThisIsDSP pic.twitter.com/dAKyxh0jId