మహిళలు అలా చేయడం వల్లే.. సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

by Hamsa |   ( Updated:2023-04-30 06:33:26.0  )
మహిళలు అలా చేయడం వల్లే.. సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల షారుక్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత ‘కిసీకా కిసీకా జాన్’ సినిమా భారీ అంచనాలతో విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచి ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ పలు విషయాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, ‘ఆప్‌ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సల్లూభాయ్ మహిళలు ధరించే దుస్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నెక్‌లైన్’ నిబంధనపై ప్రశ్నించగా.. సల్మాన్ మాట్లాడుతూ.. మహిళల శరీరాలు చాలా విలువైనవి. కాబట్టి వారు తమ శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలి.

ఇది మహిళలకు మాత్రమే కాదు. పురుషులు కూడా తమ శరీరాలను బహిరంగ పరచకూడదు. మహిళలు దుస్తులతో తమ శరీరాలను పూర్తిగా కప్పుకోకపోవడం వల్లే పురుషులు వారిని చూస్తున్నారు. అది నాకు నచ్చదని పేర్కొన్నారు. హోస్ట్ మరో ప్రశ్న కూడా వేశాడు. ‘ఒ ఓ జానే జానా’ పాటలో మీరు కూడా ఒంటిపై షర్ట్ లేకుండా కనిపించారు కదా అని అడిగాడు. దీంతో సల్మాన్ స్పందిస్తూ.. ఆ పాటలో నేను స్విమ్మింగ్ ట్రంక్స్‌తో కనిపించాను. అప్పుడు పరిస్థితులు కూడా వేరు. కానీ, ఇప్పడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మహిళలు పూర్తిగా దుస్తులు ధరించకుండా కనిపించ వద్దు. అలాగే అక్కలు, చెల్లెల్లు, భార్యలు తల్లులు కూడా పురుషులు పూర్తిగా బట్టలు వేసుకోకుండా కనిపిస్తే వారు ఇష్టపడరు’’ అంటూ సల్మాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మహిళలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed