నేను చేసిన ఆ తప్పే నా కూతుర్ని చేయనివ్వను.. అలియా షాకింగ్ కామెంట్స్!

by Jakkula Samataha |
నేను చేసిన ఆ తప్పే నా కూతుర్ని చేయనివ్వను.. అలియా షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈమె సొంతం. స్టార్ హీరోయిన్లలో ఈమె కంటూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయితనా ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా తన కూతురు రాహాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

అలియా రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పాప పేరు రాహా.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి తన కూతురుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నేను చేసిన తప్పు నా కూతురిని చేయనివ్వను అంటూ చెప్పుకొచ్చింది. అలియా మాట్లాడుతూ.. నేను నాకు 23 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ వచ్చాను. హాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్లగా, నేను అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా పేరెంట్స్‌కు దూరంగా ఉంటున్నాను అనే బాధ నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాను. నేను త్వరగా ఇంటి నుండి బయటకు వచ్చేశా అనిపించింది. అమ్మ,నాన్నను వదిలి ఉండడం చాలా కష్టంగా అనిపించింది. కానీ నేను నా కూతురి విషయంలో అలా చేయనివ్వను. తనకు 20 ఇయర్స్ వచ్చే వరకు మమ్మల్ని వదిలి వేరే చోట సెటిల్ కానివ్వను అంటూ చెప్పుకొచ్చింది. ఇక నేను భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తిని. కానీ, రాహా విషయంలో అలా కాదు. రాహాకు కింద పడే అవకాశం ఇవ్వకపోతే ఎలా లేవాలో తెలియదని మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారని’ అలియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story