Nuvve Kavali Movie: నువ్వే కావాలి మూవీ మిస్ చేసుకున్న అక్కినేని హీరో.. ఎవరంటే?

by Prasanna |
Nuvve Kavali Movie: నువ్వే కావాలి మూవీ మిస్ చేసుకున్న అక్కినేని హీరో.. ఎవరంటే?
X

దిశ, సినిమా : తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రేమకథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఫీల్ గుడ్ మూవీస్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తుంటాడు. సత్యం, గౌరి, గోదావరి, గోల్కొండ హైస్కూల్ వంటి హిట్ సినిమాలలో నటించి యూత్ తో మంచి ఫాలోయింగ్ ను సంపాదించాడు. కానీ స్టార్ డమ్ మాత్రం ఇప్పటికి అందుకోలేకపోయాడు.

హీరోలుగా సినిమాలు చేయడం లేదు. సహాయ నటుడిగా మాత్రమే మూవీస్ లో మెరుస్తున్నాడు. సీతారామంలో నెగిటివ్ రోల్లో నటించి అందరినీ షాక్ కి గురి చేసాడు.

ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నారన్న ప్రశ్నకు క్లారిటీ ఇచ్చాడు. నాకు కథ నచ్చితే తప్ప సినిమా చేయను అందువల్ల నా నుంచి సినిమాలు లేట్ గా వస్తాయి. నిజానికి తరుణ్ నటించిన నువ్వే కావాలి సినిమా ముందు నా దగ్గరకే వచ్చింది కానీ నేను చేయలేకపోయాను. నా కెరీర్ స్టార్టింగ్లో స్రవంతి రవికిషోర్ నువ్వే కావాలి ఆఫర్ ఇచ్చారని.. కానీ డేట్స్ లేకపోవడం వలన చేయలేదు. అదే సమయంలో నేను యంగ్ గా ఉన్నా.. ఇంట్లో పెళ్లి సంబందాలు కూడా చూడటం వలన ఈ మూవీ చేయడం కుదరలేదని తన మాటల్లో చెప్పుకొచ్చాడు. తన సినీ కెరీర్ లో నచ్చిన స్క్రిప్ట్ కు అవకాశం వచ్చి, చేయని సినిమా అదొక్కటే అని ఆయన తెలిపారు.

Advertisement

Next Story