అప్పుడు సమంత విషయంలో అక్కినేని ఫ్యామిలీ చేసిన తప్పే .. లావణ్య త్రిపాఠి విషయంలో మెగా ఫ్యామిలీ చేస్తుందా?

by Anjali |   ( Updated:2023-11-14 13:27:56.0  )
అప్పుడు సమంత విషయంలో అక్కినేని ఫ్యామిలీ చేసిన తప్పే .. లావణ్య త్రిపాఠి విషయంలో మెగా ఫ్యామిలీ చేస్తుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి సుపరిచితమే. ఏం మాయ చేశావే సినిమా టైంలో స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి.. కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి బంధం ఎక్కువకాలం నిలబడలేకపోయింది. మనస్పర్థాల కారణంగా సామ్-చై నాలుగేళ్లు గడవకముందే డివోర్స్ తీసుకున్నారు.

అయితే హీరోయిన్ సమంత విషయంలో అక్కినేని ఫ్యామిలీ చేసిన తప్పే ప్రస్తుతం లావణ్య విషయంలో మెగా ఫ్యామిలీ చేస్తుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత-చైతూ పెళ్లి చేసుకున్నాక.. సినిమాలు చేయాలనే ఆలోచన లేదు. ప్రేమించిన వాడితో హ్యాపీగా ఉంటే చాలనుకుంది. నాగార్జున ఫ్యామిలీ కూడా ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు. ఇక డైరెక్టర్లు సమంత వద్దకు రావడం, అవకాశాలు ఇవ్వడం.. అక్కినేని ఫ్యామిలీ కూడా అడ్డు చెప్పకపోవడంతో సామ్ లిమిట్స్ దాటింది. ఫైనల్లీ డివోర్స్ తీసుకునే వరకు వెళ్లింది.

ఇప్పుడు లావణ్యకు కూడా మెగా ఫ్యామిలీ ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. ఈ క్రమంలో దర్శకులు కూడా లావణ్యతో మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇకవేళ ఈ స్ట్రాటజీ అటు ఇటుగా మారితే మాత్రం లావణ్య తీసుకునే నిర్ణయం పరిశ్రమలో కీలకంగా మారబోతుందంటూ సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed