28 ఏళ్ల తర్వాత కలిసిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి.. ఫోటోలు వైరల్

by Kavitha |
28 ఏళ్ల తర్వాత కలిసిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి.. ఫోటోలు వైరల్
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ సుమారు 28 ఏళ్ల క్రితం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చిరంజీవి తమ్ముడిగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ వెండితెరకు పరిచయం అయింది కూడా ఈ మూవీతోనే. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ 28 ఏళ్లుగా స్టార్ హీరోగా టాలీవుడ్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా పలు సినిమాలు చేస్తున్నారు. అయితే సుప్రియ మాత్రం తన ఫస్ట్ సినిమా తర్వాత హీరోయిన్ గా బ్రేక్ రాకపోవడంతో తర్వాత స్క్రీన్ పై కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూస్తూ నిర్మాతగా మారిపోయారు.

అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించడానికి టాలీవుడ్ నిర్మాతలంతా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని కలిశారు. ఆయనకు తమ సమస్యలను చెప్పుకున్నారు. నిర్మాతల మండలి సభ్యుల్లో బాగంగానే పవన్ కల్యాణ్ తో ఫస్ట్ స్క్రీన్ షేర్ చేసుకున్న సుప్రియ యార్లగడ్డ కూడా పవన్ కల్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఓ ఫోటో దిగారు. సుప్రియ పవన్ కల్యాణ్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడంతో ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫోటోని చూసి పవన్ అభిమానులు, జనసైనికులు, ఫ్యాన్స్ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story