తండ్రికి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిన అకీరా!.. మురిసిపోతున్న పవన్ కళ్యాణ్

by Kavitha |
తండ్రికి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిన అకీరా!.. మురిసిపోతున్న పవన్ కళ్యాణ్
X

దిశ, సినిమా: గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్‌తో పాటు అకీరా నందన్ పేరు కూడా వైరల్ అవుతుంది. తన తండ్రి గెలిచాక.. పక్కనే ఉంటూ దేశ రాష్ట్ర నాయకులకు కలుస్తూ ట్రెండింగ్‌గా మారిపోయారు అకీరా. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీని కలిసిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వీటిలో అకీరా లుక్ ట్రెండ్ అవ్వడమే కాదు.. త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఫిక్సై పోయారు అభిమానులు. అయితే అకీరాకు నటన అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదని ఆ మధ్య బాంబు పేల్చారు రేణు దేశాయ్. ప్రస్తుతం మ్యూజిక్‌తో పాటు ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్స్‌పై ఫోకస్ చేస్తున్నారు అకీరా నందన్.

ఇదిలా ఉంటే తాజాగా తండ్రి కోసం అకీరా చేసిన ఓ వీడియోను విడుదల చేశారు రేణు దేశాయ్. ఈ వీడియోను స్వయంగా అకీరానే ఎడిట్ చేశారు. ఆర్నెల్ల కిందే చేసిన ఈ వీడియోను ఇప్పుడు రిలీజ్ చేశారు రేణు. పవన్ కళ్యాణ్ ల్లో ఉన్న మాంటేజ్ షాట్స్ తీసుకుని .. మధ్య మధ్యలో డైలాగ్స్ కూడా యాడ్ చేస్తూ అద్భుతంగా ఎడిట్ చేసారు అకీరా నందన్‌.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. తండ్రికి కొడుకు ఇచ్చిన గిఫ్ట్ ఇదే అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేసిన వెంటనే వీడియో వైరల్ అవ్వడం మొదలైంది. అకీరా తీరు, జోరు చూస్తుంటే త్వరలోనే ఇండస్ట్రీకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

Advertisement

Next Story