ఆ వీడియోలు చూసాకే.. సమంత ఒప్పుకుంది : బెల్లంకొండ శ్రీనివాస్

by sudharani |   ( Updated:2023-05-07 14:37:56.0  )
ఆ వీడియోలు చూసాకే.. సమంత ఒప్పుకుంది : బెల్లంకొండ శ్రీనివాస్
X

దిశ, సినిమా: బ్యాగ్రౌండ్ ఉండి మంచి యాక్టింగ్ స్కిల్స్, అందం ఉన్నప్పటికీ.. కొంత మంది హీరోలు సరైన హిట్ మాత్రం అందుకోలేరు. అందులో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకడు. తెలుగులో చివరి సారిగా ‘అల్లుడు అదుర్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ప్రజెంట్ బాలీవుడ్‌లో ‘ఛత్రపతి’ రీమేక్‌తో రాబోతున్నాడు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన హీరో.. తొలినాళ్లలో కెరీర్ స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చాడు.

వివి వినాయక్ డైరెక్షన్‌లో 2014లో ‘అల్లుడు శీను’తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్.. ఫస్ట్ సినిమాలోనే తన సరసన సమంత, తమన్నా భాటియా నటించేందుకు ఎలా ఒప్పించాడో చెప్పుకొచ్చాడు. ‘నా డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో ఓ డెమో వీడియోను తయారు చేశా. ఈ వీడియోలను సమంత, తమన్నకు పంపించాను. నా టాలెంట్, అప్రోచైన విధానానికి ఇంప్రెస్ అయిన ఇద్దరు నాతో నటించడానికి ఒప్పుకున్నారు’ అని తెలిపాడు. ఇప్పటికీ ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తనకు మంచి స్నేహితులు అని చెప్పుకొచ్చాడు హీరో.

Also Read..

'ఇంకోసారి స్టేడియంలో కనిపించావనుకో'..! వర్షిణిపై నెటిజన్స్ ఫైర్

Advertisement

Next Story