వేణు స్వామిపై నటి సంచలన వ్యాఖ్యలు.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనంట!

by Jakkula Samataha |
వేణు స్వామిపై నటి సంచలన వ్యాఖ్యలు.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనంట!
X

దిశ, సినిమా : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీల జాతకం చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకొనే క్రమంలో వీరిద్దరూ విడిపోతారని చెప్పడం, తర్వాత వారు విడాకులు తీసుకోవడంతో ఇండస్ట్రీలో ఈయన పేరు మారుమోగిపోయింది.

అందరూ వేణుస్వామి చెప్పిందే జరిగింది. ఈయన నిజమే చెప్తాడంటూ..చాలా నమ్ముతుంటారు. అంతేకాకుండా స్టార్ సీనియర్ హీరోస్ సైతం ఈయన వద్దకు వచ్చి జ్యోతిష్యం చూపెట్టుకుంటారంటే మనమే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈయన ఎప్పుడూ హీరో హీరోయిన్‌ల పై కామెంట్స్ చేస్తూ వస్తాడు.ఇక తాజాగా వేణుస్వామిపై ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన చెప్పేది అంతా అబద్ధమే అంటూ కొట్టిపారేసింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా?

నటి కుషిత.ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించలేదు. కానీ చిన్ని చిన్న సినిమాల ద్వారా తన అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నటిని యాంకర్, ఒక సంవత్సరం తరువాత ని దిశ మారుతుందని అంటూ క్రెడిట్ కొట్టడానికి ప్రయత్నించాడు కదా ఆయన ఎవరో మీకు తెలుసు? దీనిపై మీరు ఎలా స్పందిస్తారు అని ప్రశ్నించింది.

దీనికి నటి సమాధానం ఇస్తూ..నిజానికి నేను ఇష్యూ జరిగిన తర్వాతే ఆయనను కలిశాను. అంతకముందు కలవలేదు. కానీ నేను చెప్పడం వల్లనే మీరు ఫేమస్ అయ్యారని చెప్పడం చాలా తప్పు అంటూ..ఒక్కమాటలో వేణు స్వామి పరువు గంగలో కలిపేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story