మా ఆయన అవి అలౌ చేయరు.. కానీ ఆ టైమ్‌ను ఫుల్ ఎంజాయ్ చేశాం అర్థరాత్రి 12 దాటింది.. నటి పోస్ట్ వైరల్?

by Anjali |
మా ఆయన అవి అలౌ చేయరు.. కానీ ఆ టైమ్‌ను ఫుల్ ఎంజాయ్ చేశాం అర్థరాత్రి 12 దాటింది.. నటి పోస్ట్ వైరల్?
X

దిశ, సినిమా: సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంద్రజ అప్పట్లో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. ‘యమలీల, పెద్దన్నయ్య, చిన్ని చిన్ని ఆశ, సొగసు చూడతరమా’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. ఇండస్ట్రీలో ఎవరితోనూ వివాదాలు లేని ఈ హీరోయిన్ దాదాపు 80 సినిమాలకు పైగా నటించింది. ఇంద్రజ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షో లకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అలాగే ఇంద్రజ వృద్ధాశ్రమాలకు వెళ్లి.. అక్కడి పెద్దలకు సాయం చేస్తూ ఉంటుంది. అందుకే బుల్లితెర నటులందరూ ఈమెను ఇంద్రజమ్మా అని పిలుస్తుంటారు.

అయితే ఈ నటి రీసెంట్‌గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో పెట్టిన స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘ఈ స్టోరీలో ఇంద్రజ.. తన భర్త, కుమార్తెతో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫొటోలు పంచుకుంది. అలాగే హాలిడే మోడ్ ఆన్ అయ్యింది అంటూ తన వాయిస్‌తో ఓ వీడియోను కూడా స్టేటస్‌లో పోస్ట్ చేశారు. అసలు మా హస్బెండ్ ఎప్పుడు ఇలాంటివి అలౌ చేయరు. అలాంటిది ఈ రోజు బయటికొచ్చి మాతో ఎంజాయ్ చేస్తున్నారు. చెన్నైలోని కతిపర బ్రిడ్జి దగ్గర ఫుడ్ స్ట్రీట్ కొత్తగా ప్రారంభించారు. ఇప్పుడు అర్థరాత్రి 12 గంటలు దాటుతూ వస్తుంది. మేము ఈ టైమ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అంటూ ఇంద్రజ ఎగ్జైట్ అవుతూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed