బాలకృష్ణ నిజస్వరూపం బయటపెట్టిన నటుడు.. నేను ఉండగానే నా భార్యతో అలా చేసి షాకిచ్చాడంటూ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-05-04 14:43:54.0  )
బాలకృష్ణ నిజస్వరూపం బయటపెట్టిన నటుడు.. నేను ఉండగానే నా భార్యతో అలా చేసి షాకిచ్చాడంటూ కామెంట్స్!
X

దిశ, సినిమా: తొందరలో ఎన్నికలు ఉండటంతో టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ఎన్‌బీకే 109 మూవీ షూటింగ్ మధ్యలోనే ఆపేసి.. తెలుగు దేశం పార్టీని గెలిపించే ప్రయత్నంలో ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అదే జోష్‌లో బాలయ్య వరుస చిత్రాల్లో నటిస్తూ.. కుర్ర హీరోలకు పోటీనిస్తున్నాడు. అయితే ఆయన నటించిన సినిమాల్లో నటుడు సమీర్ కచ్చితంగా భాగమవుతాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి ర్యాపో కూడా ఉంది. అయితే సమీర్ ఓ సినిమా షూటింగ్‌లో చేసిన పనిని గుర్తు తెచ్చుకుని బాలయ్య నిజస్వరూపం బయట పెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీర్ మాట్లాడుతూ.. ‘‘ఓ రోజు సినిమా షూటింగ్‌ టైమ్‌లో బాలయ్య రిలాక్స్ అవుతున్నారు.

షూటింగ్‌కి గ్యాప్‌ ఇచ్చారు. దీంతో ఆయన భార్య ఫోన్‌ నెంబర్‌ అడిగాడు. ఒక్కసారిగా టెన్షన్‌ పడ్డాను. నా భార్య ఫోన్‌ నెంబర్‌ ఎందుకు అడుగుతున్నాడని కలవరానికి గురయ్యా. సర్‌ ఎందుకో చెప్పండి, ఫోన్‌ కలిపి ఇస్తాను అన్నాను. అయినా, వినకుండా బాలయ్య ఏ.. మీ వైఫ్‌ నెంబర్‌ ఇవ్వకూడదా? నేను మాట్లాడకూడదా అని అడిగాడు. దీంతో కాస్త టెన్షన్‌ టెన్షన్‌గానే ఇచ్చాను. ఏముంది ఇక నా భార్యకి ఫోన్‌ చేసి ఆయన మాట్లాడిన మాటలకు షాక్‌ అయ్యాను. మీ సమీర్‌ సెట్‌కి రాలేదు, ఆయన కోసం టీమ్‌ అంతా వెయిట్‌ చేస్తున్నాం, ఫోన్‌ ఎత్తడం లేదు, మీకు తెలుసేమో అని, మీ నెంబర్‌ కనుక్కుని ఫోన్‌ చేస్తున్నా అని మాట్లాడారు.

ఆయన రాకపోతే సినిమా ప్యాకప్‌ చెప్పేస్తామనే రేంజ్‌లో బెదిరించారు. మొదట నా భార్య నమ్మకపోవడంతో నేను హీరో నందమూరి బాలకృష్ణ అని చెప్పారు. ఇంకేముంది నా భార్య ఆ తర్వాత నాకు పదే పదే కాల్స్ చేసింది. అప్పుడు నా ఫోన్ ఆయన దగ్గరే పెట్టుకుని కట్ చేశారు బాలయ్య. దీంతో నా వైఫ్ వరుసగా మేసేజ్‌లు చేసింది. వాటిని అందరిముందే చదివారు. కొంత సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాబట్టి నేను చెబితే నమ్మదని ఆయనను అసలు విషయం చెప్పమని అడిగాను. బాలయ్య మధ్యాహ్నం వరకు వెయిట్ చేయించి అప్పుడు నా భార్యకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాకే నేను కాస్త ఊపిరిపీల్చుకున్నాను. బాలయ్య సెట్‌లో చాలా సరదాగా ఉంటారు. ఆయన ఏం చేసినా ప్రాక్టికల్‌గా చేస్తారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సమీర్ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అంత కోపంగా ఉండే ఆయన ఇలాంటివి కూడా చేస్తారా? అని అనుకుంటున్నారు.

Read More..

స్పీచ్ మధ్యలో ఎన్టీఆర్ ఫ్లకార్డ్స్ పైకి చూపించిన ఫ్యాన్స్.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..!

Advertisement

Next Story