నన్ను, మా అమ్మను తిట్టాలి అనుకుంటే ప్రభాస్ డీపీ తీసేయ్.. నెటిజన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నటుడు

by sudharani |   ( Updated:2024-10-04 09:43:44.0  )
నన్ను, మా అమ్మను తిట్టాలి అనుకుంటే ప్రభాస్ డీపీ తీసేయ్.. నెటిజన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నటుడు
X

దిశ, సినిమా: ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి ఆమె మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తీరుపై మండిపడుతూ.. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు్న్నారు. దీంతో దిగొచ్చిన మంత్రి తను మాట్లాడిన మాటలు తప్పే అని ఒప్పుకుంటూనే మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘వాళ్ల విడాకులపై నేను చేసిన కామెంట్స్ తప్పే కావచ్చు. మరి వారి విడాకులకు కారణం ఏంటో ఇంతవరకు ఎందుకు బయటకు చెప్పలేదు. నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ, సమంత నుంచి కానీ ఎవరూ రీజన్ ఏంటో చెప్పలేదు. తమకు ఇండస్ట్రీ నుంచి ఇంటర్నల్‌గా వచ్చిన సమాచారాన్నే నేను చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో మరోసారి హాట్ టాపిక్‌గా మారి నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ క్రమంలోనే ఈ వీడియోపై నటుడు బ్రహ్మాజీ స్పందిస్తూ.. ‘ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా.. మంత్రి గారు’ అంటూ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ పెట్టాడు. ప్రజెంట్ ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంటే దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది బ్రహ్మాజీకి సపోర్ట్‌గా రిప్లైలు ఇస్తుంటే.. మరికొందరూ మాత్రం బూతుమాటలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ పెట్టిన నెగిటివ్ మెసేజ్‌ను రీ ట్వీట్ చేస్తూ.. ‘నన్ను, మా అమ్మని తిట్టాలంటే మీ ఓన్ డీపీ పెట్టి తిట్టండి. మా ప్రభాస్ దేవుడు.. ఆయన డీపీ పెట్టి నన్ను తిడితే వాళ్ల ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. సరే మీ అమ్మ గారిని అడిగానని చెప్పండి సర్’ అంటూ తనదైన స్టైల్‌లో ఘాటుగా రిప్లై ఇచ్చాడు బ్రహ్మాజీ. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed