Action king Arjun: ‘విడాముయ‌ర్చి’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

by sudharani |
Action king Arjun: ‘విడాముయ‌ర్చి’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌
X

దిశ, సినిమా: యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈయన.. ప్రజెంట్ ‘విడాముయర్చి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా.. అగ్ర నిర్మాత సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్ అధినేత సుభాస్కర‌న్ స‌మ‌ర్పణ‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈచిత్రం నుంచి.. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ పాత్రకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఓ రోడ్డుపై స్టైలిష్ లుక్‌ను అర్జున్ నిల‌బ‌డి ఉండగా.. బ్యాగ్రౌండ్‌లో అజిత్ షాడోలో క‌నిపిస్తున్నాడు. ‘ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్’ (కష్టం ఎప్పటికీ వృథా కాదు) అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తుంది. కాగా.. అజిత్ కుమార్ ‘విడాముయ‌ర్చి’ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా.. ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది.


Advertisement

Next Story