బన్నీ చేతుల మీదుగా ‘AAA సినిమాస్’ థియేటర్ లాంచ్.. మాములుగా లేదుగా

by samatah |   ( Updated:2023-06-15 10:09:26.0  )
బన్నీ చేతుల మీదుగా ‘AAA సినిమాస్’ థియేటర్ లాంచ్.. మాములుగా లేదుగా
X

దిశ, సినిమా: హైదరాబాద్ అమీర్‌పేటలో ఒకప్పుడు సత్యం థియేటర్ బాగా ఫేమస్. అప్పట్లో హైదరాబాద్‌లో ఉండే ప్రతి ఒక్కరికీ ఈ థియేటర్ సుపరిచితం. కానీ ఈ థియేటర్ ఫేమ్ తగ్గటంతో కొంత కాలం క్రితం దాన్ని కూల్చేసి అక్కడ ఆసియన్ మాల్ నిర్మించారు. తాజాగా ఇందులో ఓ ఫ్లోర్‌లో అల్లు అర్జున్ ‘AAA సినిమాస్’ మల్టీ‌ఫ్లెక్స్ నిర్మించారు. ఇది జూన్ 16న ‘ఆదిపురుష్’ మూవీతో అందుబాటులోకి రానుంది. దీంతో బన్నీ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో ఈ థియేటర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్‌తో పాటు ప్రత్యేక అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. దీని లోపల మొత్తం 5 స్క్రీన్స్ ఉంటాయి. అందులో ఒకటి అల్ట్రా హెచ్‌డి సిస్టమ్ కలిగిన ఎల్‌ఈడీ స్క్రీన్. మిగిలిన నార్మల్ ప్రొజెక్టర్ స్క్రీన్. అలాగే లోపలి ఇంటీరియర్ అబ్బురపరిచే విధంగా ఉంది. పెద్ద ఫుడ్ కోర్టు కూడా ఏర్పాటు చేశారు.

Also Read: చరణ్‌కు ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే అలా చేద్దాం అన్నాడు: ఉపాసన కామెంట్స్ వైరల్

Advertisement

Next Story