- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chiranjeevi: మెగాస్టార్‌కు అరుదైన ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ప్రజెంట్ ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీ వశిష్ట డైరెక్షన్‌లో తెరకెక్కుతుండగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. చిరు ఇటీవల నాగేశ్వరరావు పేరిట ఉన్న అక్కినేని జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. దీనిని అక్టోబర్ 28న ప్రదానం చేస్తారు. అయితే చిరు పద్మవిభూషణ్ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా, చిరంజీవి మరో ఘనత సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్‌లో ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్‌లోని ఐటిసి కోహినూర్‌లో జరిగిన ఒక స్పెషల్ ఈవెంట్లో ఈ విషయం తెలిపారు. మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కేటగిరీలో మెగాస్టార్ పేరును నమోదు చేయనున్నట్లు సమాచారం. చిరంజీవి 45 ఏళ్లలో తన 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు గానూ ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులలో రెండో అవార్డు దక్కించుకోవడంతో మెగాస్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇది తెలుగు ఇండస్ట్రీతో పాటు భారతీయులందరికీ గొప్ప విషయం అని చెప్పవచ్చు.
Read More..