ఆ హీరో ఇంట్లో పనిమనిషిగా చేరిన మంత్రి కూతురు.. అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

by Sumithra |   ( Updated:2024-09-14 14:10:17.0  )
ఆ హీరో ఇంట్లో పనిమనిషిగా చేరిన మంత్రి కూతురు.. అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : 'హీరో నంబర్ 1'గా, 'కూలీ నంబర్ 1' గా అభిమానుల హృదయాలను శాసించిన గోవిందా ఒకప్పుడు బాలీవుడ్‌ను కూడా శాసించాడు. 1986లో విడుదలైన ‘ఇల్జామ్‌’ సినిమాతో సినీ కెరీర్‌ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ప్రజలను తన నటనలతో అభిమానులను బాగా నవ్వించారు. ఆయన హాస్య శైలిని ఇష్టపడని అభిమాని ఉండడు అనేంతగా జనాల హృదయాలను దోచుకున్నాడు. 90వ దశకంలో స్టార్ డమ్ ఉన్న సల్మాన్, అమీర్, షారుక్ ఖాన్ వంటి నటులకు గోవిందా గట్టి పోటీ ఇచ్చేవారు. అయితే చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు.

గోవిందా చాలా కాలం బిగ్ స్క్రీన్‌ పై కనిపించకపోయినా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గలేదు. తాజాగా అతని భార్య సునీతా అహుజా తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అంకిత్ పాడ్‌కాస్ట్‌తో టైమ్‌అవుట్‌ షోలో మాట్లాడింది. 90వ దశకంలో గోవిందాకు ఎంత పాపులారిటీ ఉందంటే అతన్ని చూసేందుకు మహిళా అభిమానులు అతని ఇంటి వెలుపల, సెట్‌లలో గుమిగూడేవారని తెలిపారు. అంతే కాదు ఆయన్ని చూసిన సంతోషంలో కొంతమంది కళ్లు తిరిగి పడేపోయేవారని కూడా చెప్పారు.

గోవిందా ఇంటికి పనిమనిషిగా మినిస్టర్ కూరుతు..

అంకిత్ పాడ్‌కాస్ట్‌తో టైమ్‌అవుట్‌లో సునీత మాట్లాడుతూ గోవిందాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతగా ఉందంటే ఒకప్పుడు ఒక అమ్మాయి తన ఇంట్లో 20 రోజుల పాటు పనిమనిషిగా ఉండిపోయింది. అయితే ఆమెను చూసినప్పుడు మాత్రం సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిలా అనిపించిందని చెప్పారు. ఆ అమ్మాయికి పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం అస్సలు తెలియదని సునిత తన అత్తకి చెప్పిందట.

కానీ ఆ అమ్మాయి ఎంత ఆలస్యమైనా మెలకువగా ఉండి గోవిందా కోసం ఎదురు చూసేదట. అది చూసిన సునిత ఆ అమ్మాయి గురించి ఆరాతీసిందని చెప్పారు. ఆ తరువాత ఆ అమ్మాయిని గట్టిగా అడిగితే తమ ముందు కన్నీళ్లు పెట్టుకుని, తాను గోవిందా అభిమానిని అని, తాను ఒక మినిస్టర్ కూతురిని అని చెప్పింది. తర్వాత ఆమె తండ్రి నాలుగు వాహనాలతో వచ్చి ఆమెను తీసుకెళ్లాడని చెప్పారు. ఇలా చాలామంది గోవిందా కోసం ఏమైనా చేసే ఫ్యాన్స్ ఉన్నారని షోలో చెప్పారు.

ఇక గోవిందా సినిమాల విషయానికొస్తే.. ఆయన చివరిసారిగా 'రంగీలా రాజా' అనే చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం 2019 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 19 లక్షలు మాత్రమే రాబట్టింది. ఈ ఫ్లాప్ సినిమా తర్వాత గోవిందా ఏ చిత్రంలో కనిపించలేదు.

Advertisement

Next Story