- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Megastar Chiranjeevi పై అభిమాని విషప్రయోగం.. బయట పెట్టిన చిరు
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ తన లైఫ్‌లో జరిగిన ఓ సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు.
1988లో చిరంజీవి నటించిన ''మరణ మృదంగం'' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తనపై విషప్రయోగం జరిగిందని తెలిపారు. షూటింగ్ సమయంలో కొంత మంది ఫ్యాన్స్ తనతో కేక్ కట్ చేయించారు. అయితే అందులో ఓ అభిమాని కేక్ ముక్క తినిపించగా అది కాస్త చేదుగా ఉండటంతో డౌట్ వచ్చి ల్యాబ్‌కు పంపిస్తే అందులో విషపూరితమైన పౌడర్ కలిసిందని రిపోర్ట్‌లో తేలింది. వెంటనే నిర్మాత కేఎస్ రామరావు ఆ కేక్ తినిపించిన వ్యక్తిని కొట్టి.. ఎందుకు ఇలా చేశావు అని అడిగారు. అప్పుడు ఆ అభిమాని చిరంజీవి నాతో ఈ మధ్య సరిగ్గా మాట్లాడటం లేదు.. ఆయన వేరే వాళ్లకు దగ్గర కావడం నాకు ఇష్టం లేదు. ఆయనకు దగ్గరవ్వాలని వశీకరణ మందు కలిపాను అని వ్యక్తి చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ వ్యక్తిది అభిమానం అనుకోవాలో, మూర్ఖత్వం అనుకోవాలో తెలియక అతడిని వదిలి పెట్టినట్లు చెప్పుకొచ్చారు చిరంజీవి. కాగా.. చిరంజీవి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read...