సినిమా చూసేందుకు వచ్చి చనిపోయిన అజిత్ అభిమాని!

by Hajipasha |   ( Updated:2023-01-11 14:19:04.0  )
సినిమా చూసేందుకు వచ్చి చనిపోయిన అజిత్ అభిమాని!
X

దిశ, సినిమా: త‌మిళ్ స్టార్ హీరో అజిత్ న‌టిస్తోన్న తాజా చిత్రం 'తునీవు'. ఈ మూవీని హెచ్. వినోద్ రూపొందిస్తోండగా.. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. పూర్తిగా ఎమోషన్‌తో కూడిన యాక్షన్ మూవీ ఇది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న విడుదల చేస్తున్నారు. తెలుగులో అదే రోజున 'తెగింపు' పేరుతో రిలీజ్ చేయనున్నారు. దీంతో మేకర్స్, అభిమానులు, జోరుగా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. చెన్నైలో ఎక్కడ చూసినా అజిత్ పోస్టర్లు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. అయితే తమిళనాడులో ఈ విడుదల కార్యక్రమం సందర్భంగా ప్రయాణిస్తున్న లారీ నుంచి దూకి అజిత్ అభిమాని మరణించాడు. భరత్ కుమార్ అనే వ్యక్తి ఉద్వేగంతో లారీపై నుంచి దూకి గాయపడి మృతి చెందినట్లు తెలుస్తోంది. అతను ఈ సినిమా 1 ఏఎమ్ షో చూడటానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story