మెగాస్టార్ చిరంజీవి జీవితంపై స్పీచ్ అదరగొట్టిన చిన్నారి.. ఈ రేంజ్‌లో ఎవరూ చెప్పుండరు!

by Anjali |
మెగాస్టార్ చిరంజీవి జీవితంపై స్పీచ్ అదరగొట్టిన చిన్నారి.. ఈ రేంజ్‌లో ఎవరూ చెప్పుండరు!
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన ప్రతిభతో పద్మ విభూషణ్ అవార్డు అందుకునే స్థాయి వరకు ఎదిగారు. మెగాస్టార్ డ్యాన్సులు, ఫైట్స్, నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతకు మించి చిరు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఎవరూ లేరు. ఈయన కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఈ హీరోను ఇన్స్పిరేషన్‌గా తీసుకుని చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న స్టార్స్, ఇతర టెక్నీషియన్స్, నటీనటులు, దర్శకులు ఎందరో ఉన్నారు. మెగాస్టార్ సినీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమే అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేకుండా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోన్న చిరు కెరీర్‌ గురించి ఎంతో మంది గొప్పగా చెప్పుకుంటారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని చైనా దేశంలోని ఓ చిన్నారి ఆదర్శవంతంగా తీసుకుని పాఠశాలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. వివరాల్లోకెళ్తే.. అనకాపల్లికి చెందిన కొణతాల విజయ్ అనే డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌కు చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం.

ఈ హీరోను ఆదర్శంగా తీసుకుని డ్యాన్స్‌లు చేసేవాడట. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నాడు. అయితే కొణతాల విజయ్ కుమార్తె తాజాగా పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో తన తండ్రి విజయానికి మెగాస్టార్ చిరంజీవినే కారణం అని చిరు గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది. చిరంజీవి ఎంతో ఆదర్శవంతమైన నటుడు. దీంతో ఆయన ఖ్యాతి చైనాకు కూడా చేరింది. అంటూ చిన్నారి ఈ హీరోపై ప్రశంసలు కురిపించింది. ఈ చిన్నారి స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఎలాగైన ఈ చిన్నారి ప్రసంగం చిరుకు తెలియాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన కామెంట్లు పెడుతున్నారు.



Advertisement

Next Story

Most Viewed