పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘బ్రో’ మూవీలో హిట్ సాంగ్ రిపీట్: వీడియో

by samatah |   ( Updated:2023-10-12 07:12:14.0  )
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘బ్రో’ మూవీలో హిట్ సాంగ్ రిపీట్: వీడియో
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘బ్రో’ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమిళ నటుడు, డైరెక్టర్ సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూలై 28న రిలీజ్ కానుంది. కాగా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఇందులో పవన్ నటించిన ఒకప్పటి ‘గుడుంబా శంకర్’ మూవీలోని హిట్ సాంగ్ ‘కిల్లీ కిల్లీ’ పాటను కొత్త వెర్షన్‌తో ఈ మూవీలో మళ్లీ రిపీట్ చేసినట్లు తెలిపారు. అలాగే సాంగ్‌కు సంబంధించిన టీజర్‌ను ఈ ఈవెంట్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. 42 సెకన్ల ఈ వీడియోలో పవన్, సాయి ధరమ్ తేజ్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఉన్నారు. అలాగే ఈ ముగ్గురు వేదికపై స్టెప్పులేసి అలరించారు.

Advertisement

Next Story