95th Oscars: ఆస్కార్‌ టాప్-1లో తారక్.. టైగర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్

by Prasanna |   ( Updated:2023-03-14 07:52:27.0  )
95th Oscars: ఆస్కార్‌ టాప్-1లో తారక్.. టైగర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్
X

దిశ, సినిమా : టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. 95వ ఆస్కార్ వేడుక సందర్భంగా సోషల్ మీడియాలో అత్యధికసార్లు ప్రస్తావించిన నటుల జాబితాలో తారక్ నెంబర్-1 స్థానంలో నిలిచాడు. అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18.7 మిలియన్ల మంది వీక్షించినట్లు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన ‘ఏబీసీ’ పలు లెక్కలను వెల్లడించింది. ఈ మేరకు గతేడాదితో పోల్చితే వీక్షకుల సంఖ్య ఈసారి 12 శాతం పెరిగినట్లు చెప్పగా.. ఈ యేడాది వేడుకలను పురష్కరించుకుని నెట్టింట వెతికన ‘టాప్ మెన్ మెన్షన్స్’ సెలబ్రిటీలలో ఎన్టీఆర్ మొదటి స్థానంలో నిలిచినట్లు నెట్ బేస్ క్విడ్ ప్రకటించింది. తారక్ తర్వాత రామ్ చరణ్ చోటు దక్కించుకోగా ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ‘కే హుయ్ ఖ్యాన్, బ్రెండెన్ ఫ్రెజర్, పొడ్రో పాస్కల్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఇక అత్యధికసార్లు వెతికిన సినిమా కూడా ‘ఆర్ఆర్ఆర్’ నిలవడం విశేషం. కాగా ఈ గుడ్ న్యూస్‌తో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read more:

ఆస్కార్ వచ్చినా.. నా లక్ష్యం నెరవేరలేదు: చంద్రబోస్

Advertisement

Next Story