‘ఆదిపురుష్’ టీం బంపర్ ఆఫర్.. 10 వేల మూవీ టికెట్లు ఉచితంగా పంపిణీ

by sudharani |   ( Updated:2023-06-11 05:07:28.0  )
‘ఆదిపురుష్’ టీం బంపర్ ఆఫర్.. 10 వేల మూవీ టికెట్లు ఉచితంగా పంపిణీ
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదిపురుష్’. అత్యంత ప్రతిష్టాత్మాతంగా నిర్మించిన ఈమూవీ ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. నిన్న ‘ఆదిపురుష్’ ట్రైలర్‌ను తిరుపతిలో ఘనంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఇదిలా ఉంటే.. మూవీకి సంబంధించి నిర్మాత అభిషేక్ అగర్వాల్ సంచలన ప్రకటన చేశారు.

‘శ్రీరాముని ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం. ఈ తరం ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన అడుగుజాడలను అనుసరించాలి ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు 10 వేల టికెట్లు ఉచితంగా అందిస్తారు. ఇందుకోసం గూగుల్ ఫాం నింపితే.. టికెట్లు నేరుగా పంపిస్తాం’’ అని అగర్వాల్ ప్రకటించారు.

Advertisement

Next Story