మనీ వాల్యూ లెస్సన్.. కూతురితో అలాంటి పనులు చేయించిన తల్లి

by Sujitha Rachapalli |
మనీ వాల్యూ లెస్సన్.. కూతురితో అలాంటి పనులు చేయించిన తల్లి
X

దిశ, ఫీచర్స్ : తల్లిదండ్రులకు పిల్లల పెంపకం ఒక టాస్క్‌. పిల్లలు పుట్టింది మొదలు వారి గురించే ఆలోచిస్తారు. వారికి ఏం ఇష్టం? ఎలాంటి వస్తువులు, దుస్తులు కొనివ్వాలి? ఎలాంటి చదువులు చదివించాలి? అందుకోసం ఎంత డబ్బు కేటాయించాలి? బిడ్డలు మంచిస్థాయిలో ఉండాలంటే ఏ దారి ఎంచుకుంటే బాగుంటుంది? ఇలా ప్రతీ ఒక్క విషయంలోనూ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. కొందరు తల్లిదండ్రులు కారణాలు అడగకుండా పిల్లలు అడిగినంత డబ్బు ఇచ్చేస్తుంటారు. అలా చేస్తే పిల్లలు పెడదారి పట్టే అవకాశం ఉండగా, మనీ వాల్యూ తెలియకుండా తయారయ్యే ప్రమాదముంది. అలాంటి పరిస్థితి తన బిడ్డకు రాకుండా పెంచాలనుకున్న ఓ అమెరికన్.. తన బిడ్డకు నేర్పిన పాఠాలేంటో మీరూ తెలుసుకోండి!

అమెరికాకు టిక్ టాక్ యూజర్ ఫెలిసియా.. తన బిడ్డకు డబ్బు ఎంత ముఖ్యమో నేర్పించాలనుకుంది. ఆమె కూతురికి ఇప్పుడు ఏడేళ్లు కాగా, ఈ విషయంపై తనకు ఐదేళ్ల నుంచే అవగాహన కల్పించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్తూ, ఆ పనులు పూర్తి చేస్తే ప్రతీ వారం ఏడు డాలర్లు శాలరీగా ఇస్తోంది. అయితే ఆ ఏడు డాలర్ల నుంచి ఫుడ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, రెంట్ కోసం పాప ఐదు డాలర్లు రిటర్న్ చెల్లించాల్సి ఉంటుందని, మిగిలిన రెండు డాలర్లు తనవేనని తెలిపిన ఫెలిసియా.. ఇందుకు సంబంధించిన టిక్ టాక్ వీడియోను షేర్ చేసింది. కాగా ఈ వీడియోపై మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. జీనియస్ ఐడియా.. ఇలా చేస్తే పిల్లలకు కచ్చితంగా మనీ వాల్యూ తెలుస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు ఆ చిన్నారి పనిచేయకపోతే తల్లి ఎంత బాధపెడుతుందో అని ఫీల్ అయిపోతున్నారు.

దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది ఆ తల్లి. తన కూతురికి కూడా పనిచేయడం ఇష్టమేనని.. బిడ్డ వర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చేంత రూడ్‌ బిహేవియర్ తనలో లేదని చెప్పింది. పాప పనిచేసినందుకు ఇచ్చే ఏడు డాలర్లలో.. ఐదు రూపాయలు రెంట్ కింద వెనక్కి ఇస్తుంది కదా! ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసి తనకు 18 ఏళ్ల వయసొచ్చాక మళ్లీ తనకే ఇచ్చేస్తానని వివరించింది. అప్పుడు 3000 డాలర్లు తన సొంతం అయిపోతాయని చెప్పింది. ఇక వారానికి తన దగ్గర మిగిలిపోతున్న రెండు డాలర్లు తనకు నచ్చిన విధంగా ఖర్చు చేసుకుంటుందన్న తల్లి.. అందరు తల్లిదండ్రుల మాదిరిగానే తన కూతురికి కూడా అన్ని వస్తువులు కొనిస్తున్నామని వివరించింది. కేవలం మనీ వాల్యూ నేర్పించేందుకు మాత్రమే పనులు చెప్తున్నామని.. అప్పుడు మనీ, లేబర్ మధ్య ఉన్న సంబంధం తనకు సరిగ్గా అర్ధమవుతుందన్నదే తమ ఉద్దేశమని తెలిపింది. ఈ వీడియోకు 7 మిలియన్ వ్యూస్ రాగా, 1.7 మిలియన్ లైక్స్‌తో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed