అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారనే…

by Sumithra |

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఈనెల 15న సూర్యాపేట సద్దుల చెరువులో ఇద్దరు పిల్లలను తోసిసి హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో కన్నతల్లే హంతకురాలు అని పోలీసులు నిర్దారించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆటో డ్రైవర్ మధుతో నాగమణి అనే వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుంది. నాగమణికి ఇదివరకే వేరే వ్యక్తితో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డు వస్తున్నారని నాగమణిపై కొద్దిరోజులుగా మధు ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 15న పిల్లలను సద్దుల చెరువులో తోసేసి తల్లి నాగమణి చంపింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story