Ajith Kumar: ఆ స్టార్ హీరోకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్?

by S Gopi |   ( Updated:2022-06-30 11:34:40.0  )
Hero Ajith Kumar is being paid 105 crore Remuneration
X

దిశ, సినిమా : Hero Ajith Kumar is being paid 105 crore Remuneration| సాధారణంగా ఏ హీరోకు అయినా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బట్టే మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది. కానీ అదే ఇప్పుడు నిర్మాతలకు తలకు మించిన భారంగా మారుతోంది. విషయానికొస్తే.. కోలీవుడ్‌ అగ్ర హీరోల్లో అజిత్‌ కూడా ఒకరు. స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా అశేష ప్రేక్షకాభిమానులు ఆయన సొంతమని తెలిసిందే. ప్రస్తుతానికి ద‌ర్శకుడు విఘ్నేష్ శివ‌న్‌తో తను ఓ సినిమా చేయ‌బోతుండగా.. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ వ‌ర్క్ జ‌రుగుతోంది. యాక్షన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందనున్న ఈ సినిమా కోసం అజిత్ ఏకంగా రూ.105 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నిర్మాణ సంస్థ ఇప్పటికే తనకు రూ. 30 కోట్ల అడ్వాన్స్‌‌గా ముట్టజెప్పినట్లు స‌మాచారం. అయితే కోలీవుడ్‌లో అజిత్‌కు గల డిమాండ్ మేర‌కే వంద కోట్లకుపైగా ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు చెబుతున్నారు.

Advertisement

Next Story