- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
APSRTC: ఏపీలో ఆర్టీసీ బస్సు టికెట్ ధరల పెంపు
దిశ, ఏపీ బ్యూరో : APSRTC is likely to increase Bus Fares in Andhra Pradesh| రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటపట్టించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా డీజిల్‌పై సెస్ పెంపునకు రంగం సిద్ధం చేసింది. దీంతో బస్ చార్జీలు కూడా స్వల్పంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చార్జీల పెంపు నుంచి సిటీ బస్సులను మినహాయించే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీఎండీ ద్వారకా తిరుమల రావు, చైర్మన్ మల్లిఖార్జునరెడ్డిలు ప్రకటించారు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రతి రోజూ11.271 బస్సులతో 41 లక్షల కిలో మీటర్లు బస్సులు నడుపుతుందని వెల్లడించారు. 45 లక్షల ప్రయాణికులను గమ్య స్ధానాలకు చేరుస్తోందని ప్రకటించారు. ఇటీవల కాలంలో పొరుగు రాష్ట్రంలో అన్ని బస్సు టిక్కెట్లు, బస్సు పాస్ ధరలు పెంచారు. అయితే ఆర్టీసీ టిక్కెట్ ధరలు 2019 డిసెంబర్ 11 న పెరిగినప్పుడు అప్పుడు లీటర్ డీజిల్ 67 రూపాయలు మాత్రమే ఉంది. కానీ డిసెంబర్ 2019 నుంచి 2022 వరకు డీజిల్ 40 రూపాయలు పెరిగింది అని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. ప్రస్తుతం మార్కెట్ బల్కు ధర రూ.131కు పెరిగిందని వివరించారు. గురువారం డీజిల్ ధరలపై మీడియాతో మాట్లాడారు.
'పెరుగుతున్న డీజిల్ ధరల వలన సంస్ధకు ప్రతి రోజు 2.50 కోట్లుఅదనంగా ఖర్చు అవుతోంది. ఇదికాకుండా బస్సుల నిర్వహణలో అవసరమైన టైర్లు, స్పేర్ పార్టులు మొదలగు వాటి ధర విపరీతంగా పెరిగింది. విధిలేని పరిస్ధితుల్లో స్వల్పంగా డీజిల్ సెస్ పెంచక తప్పడం లేదు అని ప్రకటించారు. ఇది ప్రయాణికులపై వేసే భారం కాదు. అత్యవసర డీజిల్ పై వేసే సెస్ మాత్రమేనని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. ప్రయాణికులు ప్రయాణం చేయు కిలో మీటర్ల ఆధారంగా డీజిల్ సెస్ స్లాబ్ పద్ధతిలో నిర్ణయించాం. విద్యార్థుల బస్సు పాస్ చార్జీలు నామమాత్రంగా పెంచాం. సిటీ బస్సు చార్జీలను పెంపు నుంచి మినహాయింపు ఇస్తున్నాం. డీజిల్‌పై పెంచిన సెస్ శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుంది అని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి ప్రకటించారు.
- Tags
- APSRTC