కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా మోహన్ దాస్

by Shyam |   ( Updated:2021-07-26 08:09:50.0  )
కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా మోహన్ దాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ మోహన్‌దాస్‌ను నియమిస్తూ హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. పాథాలజీ ప్రొఫెసర్ సంధ్య స్థానంలో ఆయనను ప్రిన్సిపల్‌‌గా ఫుల్ అడిషనల్ చార్జీ బాధ్యతలను అప్పగించారు. కాకతీయ మెడికల్ కళాశాలలో జనరల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ మోహన్ దాస్‌కు పదోన్నతి కల్పించారు.

థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో వైద్యవిద్యార్థులు పేషెంట్లకు సేవలందించేందుకు వైద్యవిద్యాశాఖ తగిన ఏర్పాట్లను చేపడుతుంది. ఇందులో భాగంగానే కాకతీయ మెడికల్ కళాశాలకు ఫుల్ అడిషనల్ చార్జీ ప్రిన్సిపాల్‌ను నియమించారు. వీటితో పాటు కళాశాలకు అనుసంధానంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్సలకు కావల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చే పనిలో ఉన్నారు. థర్డ్ వేవ్‌లో పేషెంట్ల తాకిడి పెరిగితే చికిత్సలు అందించేందుకు మందులు, కావాల్సిన ఇంజక్షన్లను సిద్ధం చేస్తున్నారు.

Advertisement

Next Story